ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్ అండ్ ఎమోషనల్ చిత్రం “పుష్ప”. ఈ సినిమాతోనే బన్నీ మొట్టమొదటి సారిగా పాన్ ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే.
భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ అంతకు మించిన స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. అలాగే ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ఇది మరో లెవెల్లో ఉంటుంది అని బన్నీ సమాచార వర్గాలు చెబుతున్నాయి. దీనితో బన్నీ ఫ్యాన్స్ లో మరింత ఉత్సుకత నెలకొంది. ఇప్పటికే మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ ను సుకుమార్ తెరకెక్కించారు.
వాటిలో ఒకటి ఎమోషనల్ తో కూడుకొని కథకు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని తెలిసింది. మరి పుష్ప రాజ్ ధాటి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.ఇక ఈ చిత్రాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమాగా దీనిని నిర్మిస్తున్నారు.


