రెమ్యునరేషన్ వద్దన్న అల్లు అర్జున్.!

రెమ్యునరేషన్ వద్దన్న అల్లు అర్జున్.!

Published on Sep 14, 2014 3:17 PM IST

Allu-Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఓ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఇది కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’ సినిమాలో గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. తన పార్ట్ కి షూటింగ్ చాలా రోజుల క్రితమే ఫినిష్ చేసాడు.

ఇటీవలే ఈ చిత్ర డైరెక్టర్ గుణశేఖర్ అల్లు అర్జున్ కి రెమ్యునరేషన్ గురించి మాట్లాడటానికి వెళితే అల్లు అర్జున్ రెమ్యునరేషన్ వద్దని అన్నాడు. తెలుగు హిస్టరీ మీద షూట్ చేస్తున్న ఈ సినిమా కావున ఫ్రీగా చేసానని చెప్పి పంపించాడని బన్ని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో బన్ని చేస్తున్న సపోర్ట్ కి ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు