ఆల్ ఇండియా రికార్డ్ సృష్టించిన అల్లు అర్జున్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో ఘనత దక్కించుకున్నాడు. ఈ ఘనత ఆల్ ఇండియా స్థాయిలోది కావడం విశేషం. బన్నీ కెరీర్లోని సూపర్ హిట్ చిత్రాల్లో బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ‘సరైనోడు’ కూడ ఒకటి. ఈ చిత్రాన్ని హిందీలో అదే పేరుతో డబ్ చేసి యూట్యూబ్ మాధ్యమం ద్వారా రిలీజ్ చేశారు.

గత ఏడాది మే నెలలో విడుదలైన ఈ హిందీ వెర్షన్ అనూహ్యంగా 145 మిలియన్లకు పైగానే వ్యూస్ దక్కించుకుంది ఇండియాలోనే యూట్యూబ్ ద్వారా అత్యధికంగా వీక్షించిన చిత్రంగా రికార్డ్ సొంతం చేసుకుంది. అలాగే 5 లక్షల వ్యూస్ సాధించి ఎక్కువగా లైక్ చేయబడిన ఇండియన్ సినిమాగా పేరు పొందింది. ఈ లెక్కలతో బన్నీ క్రేజ్ ఉత్తరాదిన ఎంతలా పెరిగిందో అర్థమవుతోంది.