“కలర్ ఫోటో” టీం కు బన్నీ ప్రత్యేక శుభాకాంక్షలు.!

“కలర్ ఫోటో” టీం కు బన్నీ ప్రత్యేక శుభాకాంక్షలు.!

Published on Oct 31, 2020 3:42 PM IST

ఈ మధ్య కాలంలో ఓటిటిలో విడుదల కాబడిన చిత్రాల్లో యూనానిమస్ గా అద్భుతమైన టాక్ తెచ్చుకున్న తెలుగు సినిమాల లిస్ట్ లెక్కేస్తే జస్ట్ వేళ్ళ మీదనే చెప్పొచ్చు. అలాంటి చిత్రాల్లో తాజాగా వచ్చిన “కలర్ ఫోటో” సినిమా పేరును ఖచ్చితంగా ఆడియెన్స్ చేర్చుతారు.

మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ “ఆహా”లో విడుదల కాబడిన ఈ తెలుగు చిత్రంలో టాలెంటెడ్ నటుడు సుహాస్, చాందిని చౌదరిలు హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు.

ఒక్క ఆడియెన్స్ నుంచే కాకుండా ఎందరో సినీ ప్రముఖుల నుంచి కూడా భారీ ఎత్తున ప్రశంసలను అందుకున్న ఈ చిత్రంకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మంత్రముగ్ధులు అయ్యారు. దీనితో చిత్ర యూనిట్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

హీరో సుహాస్, ఈ చిత్రంలో కీలక రోల్ చేసిన హర్ష, హీరోయిన్ చాందిని చౌదరి, దర్శకుడు సందీప్ అలాగే కథ మరియు నిర్మాణం అందించిన సాయి రాజేష్ కు తన కంగ్రాట్స్ తెలిపారు.

అలాగే కాలభైరవ అందించిన సంగీతం చాలా బాగుందని చాలా కాలం తర్వాత తాను ఒక మంచి సినిమాను చూశానని తన వాత్సల్యాన్ని వ్యక్తపరిచారు. దీనితో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/CHAFBVjHT22/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు