బన్నీ సినిమాకి ఆసక్తికరమైన టైటిల్ ?

Published on Apr 7, 2020 10:30 am IST

స్టార్ హీరో అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘పుష్ప’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారట. సినిమాలో హీరోయిన్ పేరు పుష్ప.అట, బన్నీ లాంటి స్టార్ హీరో సినిమాకి హీరోయిన్ పేరు మీద టైటిల్ పెట్టడం అంటే ఆశ్చర్యంగానే ఉంది.

ఇక రేపు ఉదయం 9 గంటలకు ఈ సినిమా నుండి అప్ డేట్ ఈ టైటిల్ గురించే రాబోతుందట. ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతో తెరకెక్కబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. అలాగే ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ ఏరి కోరి సైన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More