స్టంట్స్ నేను కూడా చేశా.. ‘రాజా సాబ్’ విషయంలో మాళవిక ప్రూఫ్స్ తో కొట్టిందిగా

స్టంట్స్ నేను కూడా చేశా.. ‘రాజా సాబ్’ విషయంలో మాళవిక ప్రూఫ్స్ తో కొట్టిందిగా

Published on Feb 14, 2026 2:00 AM IST

malavika mohanan 3

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే ది రాజా సాబ్. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ అలాగే హీరోయిన్ రిద్ధి కుమార్ లతో చేసిన ఈ హారర్ ఫాంటసీ చిత్రం అనుకున్న అంచనాలు రీచ్ కాలేదు. అయితే ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan) చేసిన యాక్షన్ ఎపిసోడ్ లో ఓ పిక్ వైరల్ గా మారింది.

మాళవిక ఈ సినిమాలో తన స్టంట్స్ చేయలేదు అని ఎవరో స్టంట్ డబుల్ చేసారని వైరల్ గా మారింది. అయితే ది రాజా సాబ్ విషయంలో మాళవిక ప్రూఫ్స్ తో అందరికీ సమాధానం ఇచ్చింది. సెట్స్ నుంచి తాను స్వయంగా చేసిన స్టంట్స్ వీడియోలు పెట్టి నేను కూడా స్టంట్స్ చేసానని ఆమె తెలిపింది.

అవన్నీ నేనే చేశాను అని సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతున్న అంశాలు నా వరకు వచ్చాయని అందుకే పెడుతున్నా అని తెలిపింది. అలాగే సినిమాల్లో ప్రతీ ఒక్కరికి స్టంట్ డబుల్ ఉంటారని ఆ క్లారిటీ కూడా ఇచ్చింది. సో ఆ రూమర్స్ విషయంలో మాత్రం అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు