రొమాంటింక్ యాక్షన్ జోనర్ లో అల్లు అర్జున్ !

Published on Apr 24, 2019 10:08 pm IST

రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు సుకుమార్. ప్రస్తుతం సుకుమార్ తన తరువాత చిత్రాన్ని బన్నీతో చెయ్యాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కాగా వీరి కలయికలో రాబోయే సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది.

బన్నీ కోసం సుకుమార్ ఓ రొమాంటింక్ యాక్షన్ జోనర్ లో అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారట. సుకుమార్ చెప్పిన ఈ స్క్రిప్ట్ సంబధించిన లైన్ బన్నీకి కూడా బాగా నచ్చిందట. అందుకే వెంటనే సినిమా చెయ్యడానికి అంగీకరించారని సమాచారం. మరి సుకుమార్ బన్నీకి కూడా రంగస్థలం లాంటి హిట్ ఇస్తాడేమో చూడాలి. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఆఖర్లో షూట్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :