యాంటి డ్రగ్ కాంపెయిన్ కి అల్లు అర్జున్ సపోర్ట్.

యాంటి డ్రగ్ కాంపెయిన్ కి అల్లు అర్జున్ సపోర్ట్.

Published on Oct 28, 2014 11:56 AM IST

Allu-Arjun

‘ఐ యామ్ దట్ చేంజ్’ షార్ట్ ఫిల్మ్ తో మార్పుకి శ్రీకారం చుట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మన భాద్యత మనం నిర్వర్తించడం కూడా దేశ భక్తే అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ అభిమానులలో చైతన్యాన్ని తీసుకొచ్చింది. ప్రేక్షకులు, సామాన్య ప్రజలలో అవగాహన కలిగించింది. తాజాగా ప్రజలలో సామాజిక చైతన్యం కలిగించే మరో కార్యక్రమానికి అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించాడు.

కోయంబత్తూర్ లో అమ్రిత స్కూల్ అఫ్ కమ్యూనికేషన్ నిర్వహిస్తున్న యాంటి డ్రగ్ కాంపెయిన్ కి తన మద్దతు ప్రకటించాడు. ‘రీచ్ ఫర్ ది స్టార్స్ నాట్ డ్రగ్స్’ అంటూ ప్రజలకు ఓ సందేశాన్ని పంపించాడు. తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ ప్రేక్షకులలో అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉంది. ఒక స్టార్ హీరో సందేశం ఇవ్వడం వలన యువతలో మార్పు రావడానికి ఆస్కారం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

anti-drugs-AA

తాజా వార్తలు