తన స్టాఫ్ పట్ల స్పెషల్ కేర్ తీసుకున్న బన్నీ.!

Published on May 19, 2021 9:03 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో “పుష్ప” అనే హ్యాట్రిక్ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ షూట్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే బన్నీకి కరోనా పాజిటివ్ రావడంతో కొంత కాలం బ్రేక్ ఇచ్చి మళ్ళీ నెగిటివ్ అయ్యానని తెలిపారు. మరి ఇదిలా ఉండగా మరో ఆసక్తికర వార్త బయటకి వచ్చింది. బన్నీ తనతో ఉండే స్టాఫ్ అంతటిపై కూడా స్పెషల్ కేర్ ఈ సమయంలో తీసుకున్నారట.

అలాగే వారిలో ఎవరైతే 45 ఏళ్ళు దాటి ఉన్నారో వారి అందరికీ వ్యాక్సినేషన్ కూడా చేయించారట. అంతే కాకుండా వారి కుటుంబాలకి సంబంధించి కూడా వారిలో 45 ఏళ్ళు పైబడిన వారు అందరికీ బన్నీ వ్యాక్సినేషన్ చేయించినట్టు తెలుస్తుంది. ఇది నిజంగా బన్నీ నుంచి ఒక మంచి మూవ్ అని చెప్పాలి. ఇక ప్రస్తుతం నటిస్తున్న పుష్ప రెండు భాగాలుగా ఈ ఏడాది ఒకటి వచ్చే ఏడాది ఒకటి విడుదల కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :