కోర్ట్ మెట్లు ఎక్కనున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!

కోర్ట్ మెట్లు ఎక్కనున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!

Published on Jun 20, 2026 7:00 AM IST

Allu-Arjun

​‘పుష్ప-2’ ప్రీమియర్ షో తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలన్న ఆయన విన్నపాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. చట్టప్రకారం మొదటి విచారణకు ఆయన కచ్చితంగా కోర్టులో స్వయంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.

​గత ఏడాది సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనపై చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన తాజా చార్జిషీటులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చారు. కేసు ట్రయల్ ప్రక్రియలో భాగంగా నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేయడంతో, ఆయన వ్యక్తిగతంగా హాజరై బెయిల్ బాండ్లు సమర్పించాల్సి ఉంది.

​కోర్టు అభ్యర్థనను తోసిపుచ్చడంతో సోమవారం ఉదయం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు రావడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, తొక్కిసలాట లాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. కోర్టు పరిసరాల్లో అదనపు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

తాజా వార్తలు