ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ‘పుష్ప 2’ మూవీతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాయి. అయితే, ఈ కలెక్షన్స్ ఫిగర్స్ విషయంలో కొంతమేర అయోమయం అభిమానుల్లో నెలకొన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా పుష్ప 2 విజయాన్ని అభిమానులు కూడా ఎంజాయ్ చేశారు.
అయితే, ఇకపై అల్లు అర్జున్ తన నుంచి రాబోయే ప్రాజెక్టులు, ఇతర విషయాలకు సంబంధించి నేరుగా ఓ స్పోక్స్‌పర్సన్ ద్వారా వెల్లడించేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఓ స్పోక్స్‌పర్సన్‌ను ఆయన అప్పాయింట్ చేయనున్నారని.. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆ స్పోక్స్ పర్సన్ మాత్రమే రివీల్ చేయనున్నారని తెలుస్తోంది.
ఇలా ఓ స్టార్ హీరో స్పోక్స్ పర్సన్‌ను పెట్టుకోవడం నిజంగా కొత్త ఐడియానే. కానీ, ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు.