త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న బన్ని – త్రివిక్రమ్ మూవీ

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న బన్ని – త్రివిక్రమ్ మూవీ

Published on Sep 4, 2014 5:08 PM IST

allu-arjun-trivikram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ అల్లు అర్జున్ ‘రుద్రమదేవి’ షూటింగ్ కోసం ఈ సినిమాని కాస్త ఆలస్యం చేసారు. చాలా కాలంగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ శుభవార్త..

ఈ చిత్ర టీం ఈ సినిమాని సెప్టెంబర్ నెలాఖరు నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ స్పెషల్ స్టంట్స్ పై ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అల్లు అర్జున్ కి గట్టి పోటీని ఇచ్చే నెగటివ్ షేడ్స్ లో యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించనున్నాడు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు టాప్ హీరోయిన్స్ జోడీకట్టనున్నారు. ఈ ముగ్గురిలో ఒకరుగా సమంతని ఫైనలైజ్ చేసారు. ప్రస్తుతం మిగిలిన ఇద్దరినీ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. గతంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘జులాయి’ సినిమాని మనకు అందించిన కె. రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించనున్నాడు.

తాజా వార్తలు