బన్నీ టార్గెట్ పాన్ ఇండియా ఇమేజ్..!

బన్నీ టార్గెట్ పాన్ ఇండియా ఇమేజ్..!

Published on Aug 1, 2020 7:34 AM IST

Allu Arjun

బన్నీ అల వైకుంఠపురంలో విజయంతో మంచి ఊపుమీదున్నారు. ఆ చిత్రంతో మొదటిసారి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్, సరికొత్త రికార్డులు తన పేరున రాసుకున్నారు. బన్నీ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అల వైకుంఠపురంలో మూవీ బన్నీ ఇమేజ్ ని భారీగా పెంచేసింది. బాలీవుడ్ ప్రముఖులు సైతం బన్నీ మూవీ గురించి మాట్లాడుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా టార్గెట్ గా బన్నీ ముందు వెళుతున్నారు.

ఆయన స్టోరీ సెలక్షన్స్ మరియు డైరెక్టర్స్ ఎంపిక చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తున్న బన్నీ దీనిని పాన్ ఇండియా చిత్రంగా ప్రకటించారు. నాలుగు భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. ఇది బన్నీ మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. ఇక నిన్న కొరటాల శివతో ప్రకటించిన తన 21వ చిత్రం కూడా పాన్ ఇండియా మూవీనే. కొరటాల సైతం యూనివర్సల్ సబ్జెక్టు తో తెరకెక్కించనున్నారు. మొత్తంగా పాన్ ఇండియా ఇమేజ్ టార్గెట్ గా బన్నీ ముందుకు వెళుతున్నాడు అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు