గెట్ రెడీ అంటున్న అల్లు అర్జున్

Published on Jun 19, 2021 1:32 am IST

అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బన్నీ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఉండనుంది. మొదట ఒక సినిమాగానే మొదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు రెండు భాగలుగా చేయాలని నిర్ణయించారు. మారిన ప్లాన్స్ మేరకు మొదటి భాగం షూటింగ్ చాలావరకు పూర్తికాగా ఇంకాస్త మాత్రమే బాకీ ఉంది. ఒక్క షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు టీమ్. లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్న నేపథ్యంలో షూటింగ్లుకు అనుమతులు లభించాయి. దీంతో అల్లు అర్జున్ సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అయ్యారు.

జూలై మొదటి వారంలో ఈ షెడ్యూల్ హైదరాబాద్లోనే మెదలుకానుంది. చాలావరకు షూట్ ఈ షెడ్యూల్లోనే ముగించాలనేది టీమ్ ప్లాన్. ఈ షెడ్యూల్లోనే బన్నీతో పాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ సహా అందరూ షూటింగ్లో జాయిన్ కానున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారు. అయితే ఆ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించలేదు టీమ్. త్వరలోనే ఈ విషయమై ఒక క్లారిటీ రానుంది. ఈ చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో ఎలివేట్ కావాలని బన్నీ, రెండవ భాగానికి డబుల్ క్రేజ్ సంపాదించాలనేది టీమ్ ఆలోచన.

సంబంధిత సమాచారం :