ప్రముఖ హీరో అల్లు అర్జున్ ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఎప్పట్నుంచో అభిమానుల నుంచి వస్తోన్న రిక్వెస్ట్‌లకు ఇప్పటికి స్పందించాడు. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా చాలామంది స్టార్లు తమ అభిమానులకు దగ్గరయ్యారు. తాజాగా ఈ లిస్ట్‌లో అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. తన నటనతో, మ్యానరిజంతో అశేష అభిమానులను పొందిన బన్నీ సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సృష్టిస్తాడన్నది అభిమానుల నమ్మకం.
కాగా అల్లు అర్జున్ ఏది చేసినా కొత్తగా ఉండేలా ప్రయత్నిస్తుంటాడన్నది తెలిసిందే. ఈ కొత్తదనం కేవలం స్టైల్, సినిమాల వరకు మాత్రమే కాదని మరోసారి ట్విట్టర్ ద్వారా నిరూపించాడు. అల్లు అర్జున్ తన ఫస్ట్ ట్వీట్‌ను కొత్తగా ప్లాన్ చేశాడు. మామూలుగా ఎవరైనా ‘నేను ట్విట్టర్‌లో జాయినయ్యా. ఇకపై నా సినిమాలకు సంబధించిన కొన్ని పోస్టింగ్స్ ఇక్కడ పెడుతూంటా’ అని ట్వీట్ చేస్తుంటారు.
కానీ అల్లు అర్జున్ కొత్తగా ఓ వీడియోలో ఇదే విషయాన్ని చెబుతూ అభిమానులకు ఫస్ట్ ట్వీట్ రుచి చూపించాడు. ఇక ఇదే వీడియోలో చివర్లో చెప్పిన “ముసలోళ్ళమైపోతున్నాం రా బాబూ..!” అన్న డైలాగైతే అభిమానులకు స్టైలిష్ స్టార్ కిక్. ట్విట్టర్‌లో @alluarjun హ్యాండిల్ ద్వారా అల్లు అర్జున్‌ను చేరుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘S/O సత్యమూర్తి’ రేపు భారీ ఎత్తున విడుదల కానుంది.
Chal chalo chaloo… Life set miloo… Idho kotha chapter… Just say HELLLOOOO! pic.twitter.com/dDIaz6VLIj
— Allu Arjun (@alluarjun) April 8, 2015


