లేటెస్ట్ లుక్ లో కేకపుట్టిస్తున్న బన్నీ..!

Published on Aug 9, 2020 12:36 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప మూవీ షూటింగ్ లో పాల్గొనాల్సివుంది. లాక్ డౌన్ కారణంగా నాలుగు నెలలుగా షూటింగ్ లేక ఇంటికే పరిమితం అవుతున్న బన్నీ, లేటెస్ట్ లుక్ కేక పుట్టించేదిగా ఉంది. అల్లు అర్జున్ తాజాగా రానా – మిహికా బజాజ్ ల వివాహానికి హాజరయ్యారు. వైట్ అండ్ వైట్ ట్రెండీ వేర్ లో గాగుల్స్ ధరించి ఉన్న అల్లు అర్జున్ అదరగొట్టారు. ఇక పుష్ప మూవీలో ఆయన డీ గ్లామర్ రోల్ చేస్తుండగా ఆ పాత్ర కోసం బాగా జుట్టు, గడ్డం పెంచేశారు.

ఈ ఏడాది అల వైకుంఠపురంలో అనే భారీ విజయాన్ని టాలీవుడ్ కి ఇచ్చిన బన్నీ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల వైకుంఠపురంలో మూవీ బన్నీ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా రికారులకు ఎక్కింది. ఇక అల్లు అర్జున్ తన 21వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. పుష్ప మూవీ అనంతరం ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More