బన్నీ-త్రివిక్రమ్ ల మూవీ సెకండ్ షెడ్యూలు ఎప్పుడంటే…!

Published on Jun 5, 2019 10:02 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “నాపేరు సూర్య” తరువాత చేసే మూవీకి దర్శకత్వం వహించే ఛాన్స్ తనకు కలిసొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ కే అప్పగించారు. తన కొరకు ఎదురుచూసిన విక్రమ్ కె కుమార్, సుకుమార్లను కాదని బన్ని మాటల మాంత్రికుడితో జతకట్టాడు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ నేడు తన ట్విట్టర్ ఖాతాలో ఈ మూవీకి సంబందించి ఓ సమాచారం పోస్ట్ చేశారు.బన్నీ 19వ సినిమాగా రానున్న ఈమూవీ నేడు హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూలు మొదలుపెట్టనున్నారట. ఈ మూవీలో బన్నీ సరసన నటిస్తున్న పూజా హెగ్డే ఈ షెడ్యూలు షూటింగ్ లో పాల్గొనననున్నారని తెలిపారు. గతంలో బన్ని పూజా హెగ్డే లు హరీష్ శంకర్ దర్శకతంలో వచ్చిన దువ్వాడ జగన్నాథం మూవీలో కలిసినటించారు.

ఈ మూవీ కి మ్యూజిక్ తమన్ అందిస్తుండగా, గీతా ఆర్ట్స్,హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More