వైరల్ : ‘అల్లు’ ఫామిలీ బ్యూటిఫుల్ పిక్

వైరల్ : ‘అల్లు’ ఫామిలీ బ్యూటిఫుల్ పిక్

Published on Oct 29, 2022 1:27 AM IST


ప్రస్తుతం టాలీవుడ్ లో యువ నటుడిగా అల్లు అర్జున్ వరుసగా సక్సెస్ లతో ఎందరో ప్రేక్షకాభిమానుల యొక్క ప్రేమతో దూసుకెళ్తున్నారు. త్వరలో పుష్ప ది రూల్ మూవీ షూట్ లో ఆయన పాల్గొననున్నారు. ఇక మరోవైపు ఆయన తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో ఏళ్ల నుండి పలు సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మిస్తూ గొప్ప పేరుతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలానే అల్లు అర్జున్ అన్నయ్య బాబీ కూడా నిర్మాతగా కొనసాగుతుండగా, తమ్ముడు శిరీష్ హీరోగా పలు సినిమాలు చేస్తున్నారు.

ఆ విధంగా దివంగత దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య వారసులుగా ఆయన పేరుని నిలబెట్టి మంచి పేరుతో కొనసాగుతోంది అల్లు ఫామిలీ. ఇక వారి కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ కానీ శుభకార్యం, పండుగలు వంటివి ఉన్నపుడు పలు సందర్భాల్లో అందరూ కలవడం జరుగుతుంటుంది. ఇక లేటెస్ట్ గా దీపావళి పండుగ సందర్భంగా అల్లు ఫామిలీ మొత్తం కూడా కలిసి దిగిన బ్యూటిఫుల్ పిక్ ని అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నేడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసారు. అందరూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ సంతోషంతో దిగిన ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు