మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్‏కు ఫస్ట్ సెలబ్రెటీ గెస్ట్‏గా అల్లు శిరీష్..!

Published on Aug 12, 2021 2:00 am IST

హిందీలో బాగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రామ్‏ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్‏కు హీరో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చ సుదీప్ హోస్ట్‏గా వ్యవహరిస్తుండగా, తెలుగుకు తమన్నా హోస్ట్‏గా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం తెలుగు వెర్షన్‌కి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. అయితే తెలుగులో ఈ కార్యక్రమానికి ఫస్ట్ సెలబ్రెటీ గెస్ట్‏గా అల్లు శిరీష్ హాజరయ్యారు.

అయితే ఈ విషయాన్ని శిరీష్ తన ఇన్‏స్టా స్టోరీ ద్వారా వెల్లడిస్తూ తమన్నాతో కలిసి మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్‏లో భాగం అయినందుకు చాలా ఎగ్‌జైటింగ్‌గా ఉందని, ఈ కార్యక్రమంలో తాను ఫస్ట్ సెలబ్రెటీ గెస్ట్ అయినందకు చాలా హ్యాపీగా ఉందని, షూటింగ్ పూర్తయ్యిందని, త్వరలోనే ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుందని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :