బన్నీ పిల్లలతో శిరీ బాబాయ్ ఫన్ !

బన్నీ పిల్లలతో శిరీ బాబాయ్ ఫన్ !

Published on May 16, 2020 11:19 PM IST

Allu sirish1

అల్లు శిరీష్ లాక్ డౌన్ లో తన అన్నయ్యల పిల్లలతో సరదాగా టైం పాస్ చేస్తున్నాడు. బన్నీ కుమారుడు అల్లు అయాన్ మరియు, కూతురు అర్హతో పాటు అల్లు బాబీ కుమారైతో కూడా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. శిరీ బాబాయ్ తో ఫన్ అంటూ వాళ్ళందరూ ముద్దుగా డాన్స్ చేస్తూ ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక గతేడాది ‘ఏబిసిడి’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు అల్లు శిరీష్. ఈ చిత్రం పర్వాలేదనే విజయాన్ని అందుకుంది. అయితే లాక్ డౌన్ తరువాత కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు శిరీష్. అన్ని పనులు పూర్తై సినిమా ఈ పాటికే మొదలవ్వాల్సింది. కానీ కరోనా దెబ్బకు సినిమా వాయిదాపడింది. ఇక ఆ మధ్య గుడ్ ఎంటెర్టైనర్ ఆన్ ది వే అని శిరీష్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు అప్ డేట్ ఇచ్చాడు.

ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైనర్ అట. ఎంటర్ టైనర్ తోనైనా అల్లు శిరీష్ సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. మరి ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు లాక్ డౌన్ తర్వాతే తెలియనున్నాయి.

https://www.instagram.com/p/CAPoTbdg_27/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు