‘సూర్య 37’నుండి తప్పుకున్న అల్లు శిరీష్ !

‘సూర్య 37’నుండి తప్పుకున్న అల్లు శిరీష్ !

Published on Jul 20, 2018 8:26 AM IST


తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 37 వ సినిమా లో నటిస్తున్నాడు. రంగం ఫెమ్ కె వి ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవల లండన్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , బోమన్ ఇరానీ , ఆర్య మొదలగు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంలో తెలుగు నుండి యువహీరో అల్లు శిరీష్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర లో నటిస్తున్నారని తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుండి ఆయన తప్పుకున్నారు.

ఆయన ఈ చిత్రం తో పాటు ‘ఏబిసిడి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాలలో నటించడానికి డేట్స్ తో సమస్య రావడం వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంధర్బంగా నా సమస్యను చిత్ర దర్శకుడు కే వి సర్ అర్థం చేసుకున్నారు. ఈ చిత్రంలో నేను ఒక భాగం అయినందుకు సంతోషిస్తున్నాను. అలాగే లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సూర్య సర్ తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఫ్యూచర్ లో మళ్ళి ఇదే టీం తో పనిచేయడానికి మరో అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు శిరీష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు