మెగా హీరో సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ !
Published on Nov 18, 2017 8:02 pm IST

తాజాగా అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, టైగర్ , ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడా వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తోన్న సినిమాకు ‘ఒక్క క్షణం’ టైటిల్ ఫిక్స్ చేసారు. డిసెంబర్ 23 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు.

ఇంటెలిజెంట్ ప్రేక్ష‌కుల నుండి సామాన్య ప్రేక్ష‌కుల వ‌ర‌కూ అంద‌రికి ఈ సినిమా నచ్చేలా దర్శకుడు తీర్చి దిద్దారు. అల్లు శిరీష్ , సుర‌భి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, సీర‌త్ క‌పూర్ ల పాత్రలు కొత్తగా ఉండబోతున్నాయి ఈ సినిమాలో. అబ్బూరి రవి మాటలు అందించిన ఈ సినిమాకు ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేసారు. శ్యామ్ కె నాయిడు వంటి సీనియర్ కెమెరా మెన్ ఈ సినిమాకు వర్క్ చేయడం విశేషం.

 
Like us on Facebook