వైరల్ అవుతోన్న అల్లు అర్హ కొత్త వీడియో !

వైరల్ అవుతోన్న అల్లు అర్హ కొత్త వీడియో !

Published on Jul 4, 2021 8:15 PM IST

allu

అల్లు అర్జున్ స‌తీమ‌ణి అల్లు స్నేహ సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా తన కుమారుడు అల్లు అయాన్ మరియు, కూతురు అర్హకు సంబంధించిన కొన్ని అందమైన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా అల్లు అర్హకు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసింది స్నేహ. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్‌ అవుతోంది.

స్నేహ, అల్లు అర్హను రెడీ చేయిస్తూ ఉండగా ఎవరో ఈ వీడియో తీశారు. కాగా ఈ వీడియోలో అర్హ పాప క్యూట్‌ స్మెల్‌ కి బన్నీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

లిటిల్‌ ప్రిన్సెస్‌ అంటూ అర్హని తెగ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. గతంలో కూడా అయాన్‌, అర్హలకు సంబంధించి అల్లు స్నేహ షేర్‌ చేసిన వీడియోలు, ఫోటోలు బాగా వైరల్‌ అయిన సందర్భాలు ఉన్నాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు