సోషల్ మీడియాలో అల్లు స్నేహ సరికొత్త రికార్డు !

Published on Jun 17, 2021 10:02 pm IST

అల్లు అర్జున్ స‌తీమ‌ణి అల్లు స్నేహ సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తన కుమారుడు అల్లు అయాన్ మరియు, కూతురు అర్హకు సంబంధించిన కొన్ని అందమైన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్ తో తరచుగా పంచుకుంటారు. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించారు. టాలీవుడ్‌లో ఏ స్టార్ వైఫ్‌కి లైనన్నీ ఫాలోయర్స్‌ని ఆమెకు ఉన్నారు.

అల్లు స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటి వరకు 4 మిలియ‌న్‌ ప్లస్‌ ఫాలోయర్స్‌ తో స‌రికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేప‌థ్యం లేకుండా స్నేహ ఈ ఘ‌న‌త అందుకోవ‌డం నిజంగా విశేషమే. ఇక అల్లు అర్జున్‌ భార్య అల్లు స్నేహ 4 మిలియన్‌ ప్లస్‌ ఫాలోయర్స్‌ని సాధించుకుంటే.. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన 3.3 మిలియన్‌ ఫాలోయర్స్‌ని, సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌ 2 మిలియన్‌ ఫాలోయర్స్‌ ను కలిగి ఉన్నారు.

సంబంధిత సమాచారం :