మరి కొద్దీ రోజుల్లో నా కొత్త చిత్రాన్ని ప్రకటిస్తా – అల్లు అర్జున్ !

మరి కొద్దీ రోజుల్లో నా కొత్త చిత్రాన్ని ప్రకటిస్తా – అల్లు అర్జున్ !

Published on Nov 7, 2018 11:00 AM IST

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా విడుదలై 6నెలలు కావస్తున్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంత వరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. ఈచిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. అయితే ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ మరో సారి నటించనున్నాడని ఈ రోజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు కూడా బన్నీ సినిమాపై ఎటువంటి ప్రకటన వెలుబడట్లేదు. ఈవిషయాన్ని స్వయంగా అల్లు అర్జునే ప్రకటించాడు.

నా చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. మరి కొన్ని రోజుల్లో నా కొత్త చిత్ర వివరాలను తెలియజేస్తాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు బన్నీ. సో అప్పటివరకు బన్నీ నెస్ట్ సినిమాపై సస్పెన్స్ కొనసాగనుందన్నమాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు