బుల్లితెర పై ఆకట్టుకుంటున్న “అల్లుడు అదుర్స్”

Published on Jul 9, 2021 4:20 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, నబ్బా నటేష్, అను ఇమన్యూల్ హీరోయిన్లు గా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల్లుడు అదుర్స్. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. అయితే ఈ ఈ చిత్రం ధియేటర్లు వద్ద చేసిన హడావిడి కంటే బుల్లితెర పై మాత్రం తన సత్తా చాటుతోంది. అయితే రెండవ సారి బుల్లితెర పై టెలికాస్ట్ కాగా, ఈ చిత్రం 4.52 టీఆర్పీ సొంతం చేసుకుంది. మొదటి సారి 6.92 టీఆర్పీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఫలితం అందుకోలేక పోయినప్పటికీ బుల్లితెర ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకొవడం లో సక్సెస్ అయింది అని చెప్పాలి. ఈ చిత్రం లో సోనూ సూద్ విలన్ పాత్ర లో నటించగా, ప్రకాష్ రాజ్, జయ ప్రకాష్ రెడ్డి, ఇంద్రజ, హరితేజ, వెన్నెల కిషోర్ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :