శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కుమార్, శ్రీ లక్ష్మీ హీరోహీరోయిన్లుగా, వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్న అల్లుడు బంగారం చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నటుడు సుమన్ హీరో హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, కమెడియన్ పృథ్వి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
అయితే పూజా కార్యక్రమాల అనంతరం నటుడు సుమన్ మాట్లాడుతూ, అల్లుడు బంగారం మూవీ ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అని, కరోనా స్టార్ట్ కాకముందు అంటే రెండు సంవత్సరాల క్రితమే దర్శక, నిర్మాతలు తనకు ఈ కథ చెప్పారు అని అన్నారు. వీరు చెప్పిన కథ ఎంతో నచ్చిందని, రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ గా ఉన్న తను, పృథ్వీ గారు రీల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ గా నటిస్తున్నట్లు తెలిపారు. ఒక విలేజ్‌లో ఉంటున్న వారి మెంటాలిటీ, ఆట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ప్రభుత్వం గురించి వారు ఏం మాట్లాడుకుంటారు, మంచి ఫ్రెండ్స్ గా ఉన్న మా మధ్య ఎందుకు డిస్టెన్స్ వస్తుంది అనే కథాంశంతో, యూత్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమే అల్లుడు బంగారం అని అన్నారు. దర్శకుడు నారాయణమూర్తి దగ్గర కో డైరెక్టర్ గా వర్క్ చేసిన అనుభవంతో నరసింహ మంచి కథను తయారు చేసుకున్నాడు అని అన్నారు. మంచి ఫ్యాషన్‌తో వర్క్ చేస్తున్న ఈ టీంను ప్రేక్షకులు ఆశీర్వదిస్తే ఇంకా ఈ ప్రొడక్షన్ లో అనేక సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.
నటుడు పృథ్వీ మాట్లాడుతూ, దర్శకుడు వెంకట నరసింహారాజ్ అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని తీసుకొని ఒక అద్భుతమైన కథను తయారు చేసుకొన్నాడు అని, రైతులు మీద, నకిలీ విత్తనాలతో రైతులు ఎలాంటి ఇబ్బందులు గురి అవుతున్నారని తెలుపుతూ పొలిటికల్ టచ్ తో దర్శకుడు ఈ కథను అద్భుతంగా తయారు చేశాడు అని అన్నారు. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు వెంకటనరసింహా రాజ్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా 24 శాఖలలో పని చేశాను. నారాయణమూర్తి గారి దగ్గర రెండు సంవత్సరాలు కో డైరెక్టర్‌గా పని చేసినట్లు తెలిపారు. ఆ అనుభవంతో స్వచ్ఛమైన పల్లెటూరి కథ రాసుకొని సుమన్ గారికి చెప్పడం జరిగింది అని తెలిపారు. నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ గారు ఇంతకుముందు చాటింగ్ సినిమాను నిర్మించారని, మంచి టీం ను సెలెక్ట్ చేసుకొని నిర్మాతకు కథ చెప్పడం జరిగిందాని అన్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటులంతా తన గురువులే అని అన్నారు. అందరి సలహాలు సూచనలతో ఈ కథను తయారు చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, అమలాపురం తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుందని, తను చెప్పిన ఈ కథను నమ్మి నాకీ అవకాశం కల్పించిన నిర్మాతకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు.
నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ మాట్లాడుతూ, దర్శకుడు తనకు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నా అని అన్నారు. ఈ మూవీలో ఫాదర్ – డాటర్ సెంటిమెంట్, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, బావ మరదల సెంటిమెంట్ ఇలా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చూసే విధంగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. ఈ చిత్రం తమ బ్యానర్‌కే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకువస్తుందని అన్నారు. ప్రారంభోత్సవానికి వచ్చి ఆశీర్వదించి, అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చిత్రం హీరో హీరోయిన్స్ మాట్లాడుతూ, తమకు ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం షారుక్ షేక్ అందించారు.


