అలాంటి పాత్ర చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధమేనట !

Published on Jun 4, 2019 2:00 am IST

తెలుగు ప్రేక్షకులకు రెహమాన్ తెలిసిన నటుడే.. ఇటీవలె ‘డి16’ సినిమాతో సోలో హీరోగా నటించాడు. దాదాపు 30సం.లుగా సౌత్ లోని అన్ని భాషల్లొ సినిమాలు చెస్తూ, అన్నీ తరహా పాత్రలు పోషించగల ఆల్ రౌండర్ గా రెహమాన్ గుర్తింపు సాధించారు. ప్రస్తుతం సెలెక్టెడ్ గా సినిమాలు చెస్తొన్న ఆయన 7 సినిమాతో మరోమారు తెరమీద కనిపించనున్నారు.

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్, రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్స్ బేనర్లో రమేష్ వర్మ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘సెవెన్’. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రెహమాన్ ముఖ్యపాత్రలో నటించారు.. సెవెన్ తన కెరీర్ లో చెసిన ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాలొని ప్రతి సన్నివేశాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చెస్తారు. నా పాత్ర సినిమాలొ కీలకం. ఇలా ప్రాధాన్యత ఉన్న పాత్రలను చెయటానికే నేను ఎప్పుడు సిద్దమేనంటున్నారు రెహమాన్.

సంబంధిత సమాచారం :

More