అమలా పాల్ ‘ఆడై’ మూవీకి కొత్త నిర్వచనం చెప్పింది

Published on Jun 19, 2019 8:02 pm IST

అమలా పాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు రత్నకుమార్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ “ఆడై” మూవీ తమిళ ట్రైలర్ నిన్న విడుదలైన సంచలనంగా మారింది.ఈ టీజర్ అందరిని ఆకర్షించి టాక్ అఫ్ ది ఇండస్ట్రీ కావడం వెనుక అసలు కారణం ఇందులో అమలాపాల్ నగ్నంగా నటించడమే. గాయాలైన శరీరంతో పై నూలుపోగు లేకుండా భయంతో వణికిపోతూ కూర్చున్న అమలాపాల్ నటించిన సన్నివేశం సంచలంగా మారింది. పాత్ర కోసం అమలాపాల్ చేసిన సాహసాన్ని అందరూ మెచ్చుకొంటున్నారు. ఇక టీజర్ సక్సెస్ తో సినిమాకు కావలసినంత పబ్లిసిటీ వచ్చి చేరింది.

‘ఆడై’ మూవీ పై అమలాపాల్ ఆసక్తికర ట్వీట్ చేసారు. ఎప్పుడూ కొత్తకాన్సెప్ట్స్ కోసం ఆసక్తి చూపే ప్రేక్షకులకు మా ఈప్రయత్నం నచ్చుతుందని గట్టి హోప్స్ పెట్టుకున్నాం. ఈ మూవీ కి కాన్సెట్ రాణి అయితే, విజువల్స్ రాజు. ఈ రాజు,రాణిల గొప్ప వివాహం లాంటి “ఆడై” మూవీని త్వరలో చూస్తారంటూ ట్వీట్ చేశారు. ఈ మూవీకి డి ఓ పి విజయ్ కార్తీక్ అందించగా,ప్రదీప్ కుమార్ సంగీతం సమకూర్చారు.

సంబంధిత సమాచారం :

X
More