‘అమలా పాల్’ మరీ ఇంత బోల్డా !

Published on Jun 18, 2019 10:00 pm IST

అమలాపాల్ ప్రస్తుతం ”ఆడై” అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయింది. అయితే విడుదలైన ట్రైలర్‌ లో అమలాపాల్ మరీ బోల్డ్‌ గా కనిపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది. అమలాపాల్ ఏకంగా ఈ సినిమాలో నగ్నంగా నటించింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. తన కుమార్తె కనిపించలేదని పోలీసులకు ఓ తల్లి ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆ అమ్మాయిని వెతకడానికి ప్రయత్నించడం, ట్రైలర్‌ చివర్లో అమలాపాల్ న్యూడ్ షాట్స్ ఇలా మొత్తంగా ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా సాగుతూ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

కాగా ఈ సినిమాలో కామిని అనే పాత్రలో నటిస్తున్న అమలా పాల్, కొన్ని దారుణమైన పరిస్థితుల నుండి ఎలా బయటపడగలిగింది అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. ముఖ్యంగా సినిమాలో స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. మరి అమలాపాల్ కి ఈ సినిమా భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

X
More