వెబ్ లో బిజీ అవుతోన్న అమలాపాల్ !

Published on Aug 9, 2020 10:01 pm IST

కరోనా దెబ్బతో.. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్నారు. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ వైపు చూస్తున్నారు. కాగా తాజాగా బ్లాక్ బ్యూటీ అమలాపాల్ కూడా వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తెలుగు అండ్ తమిళంలో తెరకెక్కిస్తున్న ఒక బోల్డ్ వెబ్ సిరీస్‌లో ఆమె నటిస్తున్నారు. ఈ కథ 1970 నాటిదని.. తమిళంలోని ఓ పాత నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతుందని తెలుస్తోంది.

అన్నట్టు అమలాపాల్ ఓ హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. హిందీలో మహేష్ భట్, జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో ఆమె నటిస్తున్నారు. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో నటించాలన్న తన కల తీరింది. దాంతో అమలాపాల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుందట. ఇక ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా కూడా వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే అమలాపాల్ కూడా పయనిస్తోంది.

సంబంధిత సమాచారం :

More