సినిమా కోసం ఏమైనా చేసే నన్ను తీసేశారు: అమలాపాల్

Published on Jun 27, 2019 12:10 pm IST

విజయ్ సెప్తుపతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఒక చిత్రంలో ముందుగా అమలాపాల్ హీరోయిన్ అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఆమెను తీసేసి ఆ స్థానంలో మేఘా ఆకాష్ ను తీసుకున్నారు. దీంతో అమలా పాల్ మీద రకరకాల రూమర్లు బయలుదేరాయి. దీంతో అమలా పాల్ స్వయంగా స్పందించి వివరణ ఇచ్చారు. తనను నిర్మాతలతో సహకరించననే కారణం చూపి సినిమాలోంచి తీసేశారని చెప్పిన అమలా పాల్ ఆ మాట వినేసరికి తన మీద తనకే అనుమానం వచ్చిందని, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వచ్చిందని, కానీ తాను కెరీర్ మొత్తం ఏనాడూ నిర్మాతల్ని ఇబ్బందిపెట్టలేదని అన్నారు.

గతంకలో చేసిన ఒక సినిమాకు నష్టాలొచ్చి నిర్మాత పూర్తి రెమ్యునరేష్ ఇవ్వలేకపోతే తానేమీ అనలేదని, అలాగే మరొక సినిమాకు వసతులు బాగోలేకపోయినా, గాయాలైనా ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను కాబట్టి పనిచేశానని గుర్తుచేస్తూ తాజా చిత్రం ‘ఆడై’కు సైతం కేవలం అడ్వాన్స్ డబ్బు మాత్రమే తీసుకుని వర్క్ చేశానని, అలాంటి నాపై నిర్మాతలకు సహకరించదు అనే ఆరోపణ చేసి సినిమా నుండి తీసేయడం భావ్యం కాదని, ఇది కేవలం ఆ చిత్ర నిర్మాణ సంస్థ చందరా ఆర్ట్స్ ప్రొడక్షన్ యొక్క ఈగో ప్రాబ్లమ్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More