సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అమ్మ దీవెన’. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పద్మ సమర్పిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, దినేష్, శరత్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శివ ఏటూరి తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రాజ్ కందుకూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఫస్ట్ షార్ట్ డైరక్షన్ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో
దర్శకుడు మాట్లాడుతూ “కథ విన్నాక అంగీకరించిన ఆమనిగారికి ధన్యవాదాలు. దర్శకుడిగా నాకు ఇది మొదటి చిత్రం. చక్కటి కుటుంబ కథా చిత్రమిది. నాకు ఈ అవకాశం కల్పించిన మా నిర్మాతలకు ధన్యవాదాలు పిల్లలు నైతిక విలువలు తెలుసుకుంటారని అభిప్రాయము ”అని అన్నారు.
ఆమని మాట్లాడుతూ ఇదొక మంచి సినిమా. ఫ్యామిలీలో అందరికీ కనెక్ట్ అవుతుంది. కుటుంబంలో తల్లి బాధ్యత ఎలా ఉంటుందనే విషయాన్ని చూపించే సినిమా. పిల్లలను ఒక స్థాయికి తీసుకురావడానికి తల్లి ఎంత కష్టపడుతుందనే విషయాన్ని ఇందులో చక్కగా చూపిస్తున్నారు. నిర్మాతలు చాలా ధైర్యంగా ముందుకొచ్చారు ఇలాంటి కథను తీయడానికి. దర్శకనిర్మాతలు నన్ను కలిసి కథ చెబుతామని అన్నప్పుడు ఆలోచించాను. కానీ కథ విన్నాక ఏమీ మాట్లాడలేదు. చేస్తాననే అన్నాను. లక్ష్మమ్మ గారి రియల్ స్టోరీ ఆమె నిజ జీవితంలో ఎలా ఇబ్బందులు పడ్డారు. పిల్లలను ఎలా పెంచారు. ఎంత బాధ్యతగా పెంచారు అన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందని అని అన్నారు. ఈ చిత్రానికి యస్.వి.హెచ్ సంగీతం అందిస్తున్నారు.
