Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
వెంకీ, దుబాయ్ శ్రీను కలిపితే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ – రవితేజ
Published on Nov 11, 2018 6:36 pm IST

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమా సక్సెస్ పై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. తనకు శ్రీను వైట్ల దర్శకత్వంలో పనిచేయటం చాలా సరదాగా ఉంటుందని.. అమర్ అక్బర్ ఆంటోనీ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని తెలిపారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ చిత్రం వెంకీ, దుబాయ్ శ్రీను చిత్రాల్లోని కామెడీని కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని రవితేజ చెప్పుకొచ్చారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ తో ఇంకా అనేక చిత్రాల్లో నటించాలని ఉందని తెలిపాడు.

కాగా ఈ చిత్రం నవంబర్ 16న విడుదల కానుంది. ఇలియానా మళ్లీ చాలా కాలం తరువాత ఈ చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. అయితే గత కొంతకాలంగా శ్రీను వైట్ల, రవితేజ వరుస పరాజయాలతో సతమతవుతున్నారు. దాంతో ఈ చిత్రం విజయం ఈ ఇద్దరికీ చాలా కీలకం కానుంది.

సంబంధిత సమాచారం :