క్రేజీ బయోపిక్ కి అమెజాన్ ఆఫర్ ?

క్రేజీ బయోపిక్ కి అమెజాన్ ఆఫర్ ?

Published on Aug 2, 2020 2:14 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ బయోపిక్ బయోపిక్ విడుదల పై గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ, అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ మాత్రం లేదు. కాగా తాజాగా ఈ సినిమాని ఓటిటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని.. ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చిందట.

దాంతో ఎందుకు ఓటిటీలో రిలీజ్ చెయ్యకూడదు అని మేకర్స్ ఆలోచనలో పడినట్లు బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు. ఇక 83 అనే టైటిల్ తో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో విజయం సాధించి వరల్డ్ కప్ ను ఎలా చేజిక్కించుకున్నారు ? అలాగే కపిల్ జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటి ? వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు