‘సలార్’ కోసం భారీ బేరసారాలు జరుగుతున్నాయట

Published on Jun 18, 2021 3:02 am IST

ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా లెవల్. దేశం మొత్తం మార్కెట్ జరుగుతుంది. అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ ప్రభాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అందుకే ఆయన సినిమాలకు బిజినెస్ వర్గాల్లో అంత భారీ డిమాండ్. ప్రజెంట్ ఆయన చేస్తున్న చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే కొంత షూటింగ్ ముగియగా వచ్చే నెల నుండి చిత్రీకరణ రీస్టార్ట్ కానుంది. ‘కెజిఎఫ్’ సినిమాతో ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆయన డైరెక్టర్ కావడంతో ‘సలార్’ మీద క్రేజ్ భారీగా పెరిగింది.

ఇప్పటికే థియేట్రికల్ హక్కుల కోసం డీస్ట్రీబ్యూటర్లు పోటీపడుతుండగా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు బేరసారాలు మొదలయ్యాయట. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధర చెక్కించి హక్కులను సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉందట. ఓటీటీ రైట్స్ విషయంలో ఇదే అతిపెద్ద డీల్ అని, గతంలో ఏ సినిమాకు ఇంత ప్రైజ్ పలకలేదని అంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా డీల్ క్లోజ్ కాలేదట. సినిమాకున్న క్రేజ్ చూస్తుంటే సినిమా పూర్తికాకముందే హక్కులన్నీ అమ్ముడైపోయేలా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :