ఏఎంబి సినిమాస్‌కు జరిమానా.. పాత వార్తలు ప్రచారం చేయవద్దంటున్న యాజమాన్యం..!

ఏఎంబి సినిమాస్‌కు జరిమానా.. పాత వార్తలు ప్రచారం చేయవద్దంటున్న యాజమాన్యం..!

Published on Jun 30, 2026 8:13 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్ ఏఎంబి సినిమాస్ (AMB Cinemas) పై జరిమానా విధించినట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మరియు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై యాజమాన్యం అధికారికంగా స్పందించింది. ఈ మేరకు ఏఎంబి మేనేజ్‌మెంట్ ఒక క్లారిటీ నోట్‌ను విడుదల చేసింది.

ప్రస్తుతం మీడియాలో ప్రచారమవుతున్న జరిమానా వార్త ఇప్పటిది కాదని, అది చాలా పాత విషయమని యాజమాన్యం స్పష్టం చేసింది. ఆ సంఘటనకు సంబంధించిన అన్ని రకాల చట్టపరమైన క్లియరెన్స్‌లు మరియు ప్రక్రియలు ఎప్పుడో పూర్తయ్యాయని వారు పేర్కొన్నారు. గతంలో జరిగిన ఒక పాత విషయాన్ని ఇప్పుడు మళ్లీ కొత్త వార్తగా ప్రచారం చేయడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో, వాస్తవాలను తెలుసుకోకుండా ఇలాంటి పాత మరియు తప్పుదోవ పట్టించే వార్తలను కవర్ చేయవద్దని, ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలను మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఏఎంబి మేనేజ్‌మెంట్ కోరింది.

తాజా వార్తలు