అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్‌ను నిర్మాత వంశీ నందిపాటి విడుదల చేశారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా విడుదల చేస్తోంది. ప్రాపర్ హైదరాబాద్ నేపథ్యంలో, మిడిల్ క్లాస్ జీవితాల చుట్టూ సాగే కథతో ఈ సినిమాను రూపొందించారు.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వంశీ నందిపాటి మాట్లాడుతూ, ఈ చిత్రం స్నేహం, ప్రేమ అనే అంశాల చుట్టూ నడుస్తుందని, కథాంశం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకుల మద్దతు అవసరమని కోరారు. చిత్రంలో హైదరాబాద్ సంస్కృతి, బిరియానీ అంశాలు ప్రధానంగా ఉంటాయని మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి, చిత్రబృందం పేర్కొన్నారు. వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎస్‌వీకే కెమెరామెన్‌గా, రోహిత్ పెనుమత్స ఎడిటర్‌గా వ్యవహరించారు.


