రిచా గంగోపాధ్యాయ్ కి మిచిగాన్ అరుదైన పురష్కారం

రిచా గంగోపాధ్యాయ్ కి మిచిగాన్ అరుదైన పురష్కారం

Published on Jun 15, 2015 1:27 PM IST

richa-gangopadyaya
లీడర్, మిరపకాయ్, మిర్చి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అందాల భామ రిచా గంగోపాధ్యాయ్. గత కొంత కాలంగా రిచా గంగోపాధ్యాయ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన స్టడీస్ లో బిజీగా ఉంది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బెంగాలీ బ్యూటీకి తాజాగా ఓ అరుదైన పురష్కారం దొరికింది. అమెరికాలోని మిచిగాన్ దీనికి వేదికైంది. జూన్ 14వ తేదీ అనగా ఆదివారం రాత్రి మిచిగాన్ ఇండియన్ అసోషియేషన్ వారు మిచిగాన్ ఇండియన్ హాల్ అఫ్ ఫేం అవార్డు తో పాటు కాంగ్రెషనల్ గుర్తింపును కూడా ఇచ్చింది.

ప్రతి సంవత్సరం మిచిగాన్ ఇండియా అసోషియేషన్ వారు రాకలరకాల డిపార్ట్ మెంట్స్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి మిచిగాన్ హాల్ అఫ్ ఫేం అవార్డుని బహుకరిస్తారు. ఈ ఏడాది సెలక్ట్ చేసిన 18 మందిలో రిచా గంగోపాధ్యాయ్ ని ఒకరుగా సెలక్ట్ చేసారు. ఈ అవార్డు అందుకున్న రిచా గంగోపాధ్యాయ్ చాలా అందంగా ఉండడమే కాకుండా మిచిగాన్ ఇండియా అసోషియేషన్ వారికి స్పెషల్ థాంక్స్ కూడా చెప్పింది. ప్రస్తుతం స్టడీస్ లో బిజీగా ఉన్న రిచా గంగోపాధ్యాయ్ త్వరలోనే మళ్ళీ వెండితెరపై కనిపించనుంది.

తాజా వార్తలు