స్టార్ హీరో వ్యక్తిగత సిబ్బందికి కరోనా.

Published on Jun 30, 2020 12:59 pm IST

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా ఓ ముఖ్య విషయాన్ని పంచుకున్నారు. ఆయన సిబ్బందిలో కొందరికి కరోనా సోకినట్లు తెలియజేశారు. వెంటనే స్పందించిన ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక వైరస్ సోకిన వారిని కొరెంటైన్ కి పంపినట్లు ఆయన తెలియజేశారు. దేశంలో కరోనా ప్రమాదకర స్థాయికి చేరుకోగా ముంబై మరింత ప్రమాదపు అంచుల్లో ఉంది. దీనితో సామాన్యులు సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా ఈ వైరస్ బారినపడుతున్నారు.

ఇక అమీర్ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా అమీర్ అమ్మగారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటిస్తున్నారు. 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More