మా అమ్మ సురక్షితం అంటున్న స్టార్ హీరో.

Published on Jul 1, 2020 5:06 pm IST

స్టార్ హీరో అమిర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా ఓ ముఖ్య విషయాన్ని పంచుకున్నారు. అదేమిటనగా ఆయన తల్లిగారికి కరోనా టెస్ట్ చేయగా నెగెటివ్ అని వచ్చిందట. దానికి సంతోషం వ్యకం చేసిన అమిర్ ఖాన్ తమకై ప్రార్ధనలు చేసిన ఫ్యాన్స్ కి ధన్యవాదాలు తెలిపారు. అమిర్ ఖాన్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పోజిటివ్ అని రాగా…అమిర్ కుటుంబ సభ్యులు మొత్తం…కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ టెస్ట్ లో అమిర్ ఖాన్ తల్లికి వైరస్ సోకలేదని తెలుసుకొని అమిర్ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటిస్తున్నారు. 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ ఆర్మీ జవాను పాత్ర పోషిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More