కరోనా రోగి జీవితం ఒక నరకం-అమితాబ్

కరోనా రోగి జీవితం ఒక నరకం-అమితాబ్

Published on Jul 26, 2020 10:19 PM IST

Amitabh Bachchan

బిగ్ బి అమితాబ్ కుటుంబం కరోనా బారిన పడడం అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది. అమితాబ్ తో సహా అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య మొత్తం నలుగురు కరోనా బారిన పడ్డారు. వీరందరూ ముంబై నానావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కాగా అమితాబ్ కరోనా రోగిగా తన అనుభవాలాను పంచుకున్నారు. ఐసోలేషన్ అంటే ఒక అతి పెద్ద ఒంటరితనం. అక్కడంతా ఏకాంతమే. ఎవరూ కనబడరు, వినబడరు, మనకు మనమే అంతా అంటూ అమితాబ్ ఆ భయానక అనుభూతులను పంచుకున్నారు.

డాక్టర్లు వస్తారు, వారు కూడా పీపీఈతో ముసుగేసుకుని ముఖం కూడా కనిపించకుండా ఉంటారు. మామూలు రోగులకు వైద్యం చేసినపుడు డాక్టర్లు ఒంటి మీద చేయి వేసి భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, వారికి కూడా కరోనా భయం ఉంటుంది. పైగా పాటించాల్సిన నియమాలు, కోవిడ్ నిబంధల కారణంగా వారు దూరంగానే ఉంటారు. రోగితో మాట్లాడేది కూడా వీడియో ద్వారానే.మొత్తానికి ఇదో చిత్రమైన అనుభవం. మనకు మనమే ఉంటాం ఆని చెప్పుకొచ్చారు అమితాబ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు