మెగాస్టార్ ఆమెను పెళ్లి చేసుకోవడం వెనుక మరీ ఇంత సిల్లీ రీజనా…!

Published on Jun 3, 2019 12:45 pm IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్ జయ బచ్చన్ లు నేడు వివాహదినం జరుపుకుంటున్నారు. 1973 పెళ్లితో ఒక్కటైన ఈ జంట నేటికి దంపతులుగా 46 వసంతాలు పూర్తిచేసుకున్నారు. ఐతే జయా బచ్చన్ ను తాను ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో అన్న విషయాలపై ఆసక్తికర పోస్ట్ ను తన బ్లాగ్ లో షేర్ చేశారు.

‘జంజీర్’ మూవీ విజయం సాధిస్తే లండన్ ట్రిప్ కి తీసుకెళ్తాను అని అమితాబ్ ఆయన మిత్రులకి మాట ఇచ్చారంట. జంజీర్ అఖండ విజయం సాధించడంతో ఫ్రెండ్స్ తో పాటు జయ తో లండన్ కి వెళ్ళడానికి అమితాబ్ సిద్దమయ్యారట. అప్పటికే డేటింగ్ లో ఉన్న అమితాబ్ జయ లు పెళ్లి కాకుండా విదేశీ టూర్ కి వెళ్ళడానికి అమితాబ్ తండ్రి ఒప్పుకోలేదట. ఐతే పెళ్లి చేసుకొని వెళితే మాత్రం ఒకే అన్నారట. ఫ్రెండ్స్ ని లండన్ తీసుకెళతానని ఇచ్చిన మాట తప్పలేక వెంటనే జయ మెడలో తాళి కట్టాడట అమితాబ్. నెక్స్ట్ డే లండన్ విమానం ఎక్కి ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్ళిపోయాడట అమితాబ్.

సంబంధిత సమాచారం :

More