‘బాహుబలి’పై అమితాబ్ ప్రశంసల వర్షం!

Amitabh-Bachchan-lauds-Baah
ఇప్పుడు దేశమంతా ‘బాహుబలి’ ఫీవర్ పట్టుకుంది. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఇలా భారీ తారాగణమంతా ముంబైలో హల్‌చల్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో బాహుబలికి భారీ క్రేజ్ తెచ్చిపెట్టే క్రమంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు రానా బాహుబలి ఫస్ట్‌లుక్, ట్రైలర్‌లను చూపించారట.

ట్రైలర్, ఫస్ట్‌లుక్ చూసిన అమితాబ్ బచ్చన్, రాజమౌళి టేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. “ఇలాంటి విజువల్ వండర్‌ను ఇండియన్ సినిమాపై ఆవిష్కరించడానికి గట్స్ ఉండాలి. కేవలం హాలీవుడ్‌లో మాత్రమే చూడగల విజువల్ ఎఫెక్ట్స్‌ను ఒక ఇండియన్ సినిమాలో చూడడం అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో నేనూ నటించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది” అన్నారు. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ బాహుబలిపై ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించడం విశేషం. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!

Exit mobile version