‘మనం’ సినిమాలో అమితాబ్ బచ్చన్.?

‘మనం’ సినిమాలో అమితాబ్ బచ్చన్.?

Published on Apr 28, 2014 9:00 AM IST

Amitabh-Bachchan
బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ అక్కినేని ఫ్యామిలీ హీరోలైన ఎ.ఎన్.ఆర్, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘మనం’ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నాడా.? అని అడిగితే ఫిల్మ్ నగర్ వర్గాలు అవుననే అంటున్నాయి.

ఇటీవలే అమితాబ్ బచ్చన్ పై ఈ సినిమాకి సంబందించిన కొన్ని సీన్స్ ని కూడా హైదరాబాద్ లో షూట్ చేసారు. కానీ ఈ చిత్ర టీం ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచింది. ‘మనం’ సినిమా ఎ.ఎన్.ఆర్ నటించిన చివరి సినిమా కావడంతో వీలైనంత వరకు ఈ సినిమాని సంథింగ్ స్పెషల్ గా ఉంచడానికి నాగార్జున ట్రై చేస్తున్నాడు.

సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకుడు. నాగార్జున ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇప్పటికే సరికొత్త ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న ఈ సినిమా మే 23న విడుదల కానుంది.

తాజా వార్తలు