‘సైరా’ నుండి అమితాబ్ లుక్ విడుదలకానుంది !

Published on Oct 11, 2018 10:00 am IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’ షూటింగ్ ప్రస్తుతం జార్జియా దేశంలో జరుగుతుంది. ఇక ఈచిత్రంలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే. రేపు ఆయన76వ జన్మదినం సందర్భంగా ఈచిత్రంలోని ఆయన లుక్ ను రేపు ఉదయం 8గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఈచిత్రంలో చిరు ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి పాత్రలో నటిస్తుండగా అమితాబ్ ఆయనకు గురువుగా కనిపించనున్నారు.

సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై హీరో రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :