ప్రభాస్ ని హీరో చేసిన అమితాబ్ మూవీ

Amitabh-Bachchan-lauds-Baah
కటౌట్ చూడటానికి ఆరడుగులు ఉటుంది, గట్టిగా గుద్దితే విలన్ ఒక్క గుద్దుకే సచ్చిపోతాడేమో అనేలా ఉండే పర్సనాలిటీ ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ తోనే మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలతో స్టార్డం తెచ్చుకొని మాస్ హీరోగా ఎదిగాడు. ఇది కాసేపు పక్కన పెట్టి సినిమాల్లోకి రాకముందు ప్రభాస్ కెరీర్ పరంగా ఏం చెయ్యాలనుకున్నాడు అనే విషయానికి వస్తే.. స్వతహాగా ప్రభాస్ సిగ్గు, బిడియం కలిగిన వాడని అందరికీ తెలుసు.

అందుకే ప్రభాస్ ఒక స్టేజ్ లో నటుడు కాకూడదు అని నిర్ణయించుకొని, ఏదో ఒక బిజినెస్ చేస్తూ సెటిల్ అవ్వాలని అనుకున్నాడట. ఇదే విషయాన్ని వాళ్ళ నాన్నకి కూడా చెప్పాడట. కానీ ఒక రోజు సడన్ గా యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యి యాక్టింగ్ స్కూల్ లో చేరాడు. ఒక్కసారిగా ప్రభాస్ తన మైండ్ సెట్ మార్చుకొని, నటుడిగా మారడానికి స్ఫూర్తి నిచ్చింది మాత్రం బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ నటించిన ‘దీవార్’ సినిమా. ఈ సినిమా చూసాకే తనకు నటుడవ్వాలనే కోరిక మొదలైందని ప్రభాస్ చెప్పాడు. ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి’ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని ప్రభాస్ తెలియజేశాడు.

సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని జూలై 10న రిలీజ్ కి సిద్దమవుతోంది. ప్రభాస్ తో పాటు రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ మరియు హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

Exit mobile version