సైరా షూటింగ్ పూర్తి చేసిన అమితాబ్ !

Published on Mar 16, 2019 4:24 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో తన పాత్ర తాలూకు షూటింగ్ ను పూర్తి చేశాడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఈ చిత్రంలో ఆయన చిరు కి గురువుగా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయన తార కథానాయికగా నటిస్తుండగా , జగపతి బాబు , తమన్నా, విజయ్ సేతుపతి, సుధీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రం ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More