చెర్రీ పేరుతో ఐస్‌క్రీమ్ ఫ్లేవర్!

చెర్రీ పేరుతో ఐస్‌క్రీమ్ ఫ్లేవర్!

Published on Aug 11, 2015 1:54 AM IST

Ram-charan
మెగాస్టార్ తనయుడిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, ఆ తర్వాత అతికొద్ది కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపును, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. అభిమానులతో ముద్దుగా చెర్ర్రీ అని పిలిపించుకునే ఈ స్టార్‌కు ఐస్‌క్రీం అంటే పిచ్చి ఇష్టం. అలాంటి ఐస్‌క్రీం ఫ్యాన్ అయిన స్టార్ పేరుతోనే ఓ ఐస్‌క్రీం ఫ్లేవర్ ఉంటే? ఆలోచనే బాగుంది కదూ? ఇదే ఆలోచన హైద్రాబాద్‌లోని ఓ పార్లర్‌కు వచ్చేసింది. ఏమాత్రం ఆలోచించకుండా తాము కొత్తగా ఓ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌ను పరిచయం చేశారు.

ఓ సో స్టోన్‌డ్ పేరుతో హైద్రాబాద్‌లో రన్ అవుతోన్న ఓ ఐస్‌క్రీమ్ పార్లర్, కొత్తగా తయారు చేసిన ఓ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌కు ‘చెర్రీ చెర్రీ’ అన్న పేరును ఖరారు చేసింది. ఇక ఈ విషయాన్ని తమ కస్టమర్లకు తెలియజేస్తూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరుమీద ఈ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌ను లాంచ్ చేశామని చెప్పుకొచ్చింది. చెర్రీ ఫ్రూట్స్‌తో తయారయ్యే ఈ ఫ్లేవర్‌ వెనిల్లా ఫ్లేవర్‌ను పోలి ఉంటుందట. ఏది ఏమైనా ఓ స్టార్ హీరో పేరును ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌కు పెట్టడం కొత్తగా ఉంది కదూ!?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు