నాగ చైతన్య నుంచి ఈరోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Apr 17, 2021 11:08 am IST


అక్కినేని టాలెంటెడ్ హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ”. టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ మూలాన మేకర్స్ వాయిదా వేశారు.

అలాగే కొత్త డేట్ ను కూడా కన్ఫర్మ్ చేసారని వార్త వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చైతు నుంచి ఓ అప్డేట్ ఈ సినిమాకు సంబంధించే రానున్నట్టు అర్ధం అవుతుంది. మన తెలుగు మొట్టమొదటి స్ట్రీమింగ్ యాత్ప్ “ఆహా” వారు ఈ విషయం తెలియజేసారు.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు చైతు ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి అది లవ్ స్టోరీ సినిమా కోసమేనా లేక వేరే ఏదన్నా అనౌన్సమెంట్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :